ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక రైలు .. ఏంటి దీని స్పెషాలిటీ?

ప్రవాసీ భారతీయ దివస్‌ను( Pravasi Bharatiya Divas ) పురస్కరించుకుని ఎన్ఆర్ఐల( NRI’s ) కోసం ఒక ప్రత్యేక రైలును ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ప్రారంభించారు.అదే ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్.

 Pm Narendra Modi Inaugurates Pravasi Bharatiya Express For Nri Tourists Details,-TeluguStop.com

ఈ అత్యాధునిక రైలును విదేశాంగ శాఖ.ప్రవాసీ తీర్ధ దర్శన్ యోజన కింద ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) సహకారంతో ప్రవేశపెట్టారు.ఈ ప్రత్యేక రైలు 45 నుంచి 65 ఏళ్ల వయసు గల ప్రవాస భారతీయుల కోసం రూపొందించారు.ఇది భారతదేశంలోని ప్రఖ్యాత పర్యాటక, మతపరమైన ప్రదేశాలలో ప్రవాస భారతీయులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని రైల్వే శాఖ అభిప్రాయపడింది.

Telugu Bhubaneswar, Indian Railways, Irctc, Nri, Nris, Odisha, Train-Telugu NRI

మూడు వారాల పాటు సాగే ఈ రైలు ప్రయాణానికి సంబంధించి వివరాలను కూడా రైల్వేశాఖ విడుదల చేసింది.న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు .అయోధ్య, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, పాట్నా, గయ, వారణాసి, మహాబలిపురం, ఏక్తా నగర్ (కెవాడియా) , అజ్మీర్, పుష్కర్ , ఆగ్రా వంటి ప్రదేశాల మీదుగా ప్రయాణిస్తుంది.ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌లో( Pravasi Bharatiya Express ) 156 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

రైలు ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.దీనికి అదనంగా ఈ రైలులో ప్రయాణించేందుకు భారతదేశానికి వచ్చే వారికి విమాన ఛార్జీలలో 90 శాతం కూడా కేంద్రమే భరించనుంది.

కేవలం 10 శాతం మాత్రమే ప్రవాస భారతీయులు భరిస్తారు.రైలు ప్రయాణ సమయంలో వారికి 4 స్టార్ లేదా లగ్జరీ హోటల్స్‌లో బసను ఏర్పాటు చేయనున్నారు.

Telugu Bhubaneswar, Indian Railways, Irctc, Nri, Nris, Odisha, Train-Telugu NRI

కాగా.18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో( Bhubaneswar ) జనవరి 8 నుంచి 10 వరకు జరిగింది.ఈ ఏడాది “Diaspora’s Contribution to a Viksit Bharat,” థీమ్‌తో కార్యక్రమం నిర్వహించారు.డయాస్పోరాలో యువత, మహిళా నాయకత్వం, స్ధిరమైన అభివృద్ధి వంటి అంశాలను కవర్ చేసేలా ఐదు ప్లీనరీ సెషన్‌లను నిర్వహించారు.

ఇక ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టినా క్లారా హాజరైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆమెను ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube