ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక రైలు .. ఏంటి దీని స్పెషాలిటీ?
TeluguStop.com
ప్రవాసీ భారతీయ దివస్‌ను( Pravasi Bharatiya Divas ) పురస్కరించుకుని ఎన్ఆర్ఐల( NRI's ) కోసం ఒక ప్రత్యేక రైలును ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ప్రారంభించారు.
అదే ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్.ఈ అత్యాధునిక రైలును విదేశాంగ శాఖ.
ప్రవాసీ తీర్ధ దర్శన్ యోజన కింద ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) సహకారంతో ప్రవేశపెట్టారు.
ఈ ప్రత్యేక రైలు 45 నుంచి 65 ఏళ్ల వయసు గల ప్రవాస భారతీయుల కోసం రూపొందించారు.
ఇది భారతదేశంలోని ప్రఖ్యాత పర్యాటక, మతపరమైన ప్రదేశాలలో ప్రవాస భారతీయులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని రైల్వే శాఖ అభిప్రాయపడింది.
"""/" /
మూడు వారాల పాటు సాగే ఈ రైలు ప్రయాణానికి సంబంధించి వివరాలను కూడా రైల్వేశాఖ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు .
అయోధ్య, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, పాట్నా, గయ, వారణాసి, మహాబలిపురం, ఏక్తా నగర్ (కెవాడియా) , అజ్మీర్, పుష్కర్ , ఆగ్రా వంటి ప్రదేశాల మీదుగా ప్రయాణిస్తుంది.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌లో( Pravasi Bharatiya Express ) 156 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రైలు ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.
దీనికి అదనంగా ఈ రైలులో ప్రయాణించేందుకు భారతదేశానికి వచ్చే వారికి విమాన ఛార్జీలలో 90 శాతం కూడా కేంద్రమే భరించనుంది.
కేవలం 10 శాతం మాత్రమే ప్రవాస భారతీయులు భరిస్తారు.రైలు ప్రయాణ సమయంలో వారికి 4 స్టార్ లేదా లగ్జరీ హోటల్స్‌లో బసను ఏర్పాటు చేయనున్నారు.
"""/" /
కాగా.18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో( Bhubaneswar ) జనవరి 8 నుంచి 10 వరకు జరిగింది.
ఈ ఏడాది “Diaspora’s Contribution To A Viksit Bharat,” థీమ్‌తో కార్యక్రమం నిర్వహించారు.
డయాస్పోరాలో యువత, మహిళా నాయకత్వం, స్ధిరమైన అభివృద్ధి వంటి అంశాలను కవర్ చేసేలా ఐదు ప్లీనరీ సెషన్‌లను నిర్వహించారు.
ఇక ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టినా క్లారా హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమెను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది.
రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా..?