మరణం సమీపించే ముందు సంకేతాలను మహాశివుడే పార్వతికి చెప్పిన విషయాలు..

ఈ సృష్టిలో జీవిస్తున్న ఏ జీవికైనా కచ్చితంగా మరణం అనేది వస్తుంది.అంతేకాకుండా సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధారపడి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

 The Things Lord Shiva Told Parvati About The Signs Before Death , Death Signs ,-TeluguStop.com

మన కర్మ ప్రకారమే ఎప్పటికైనా కచ్చితంగా మరణం వస్తుందని కూడా చెబుతున్నారు.కానీ మనకు మరణం వచ్చే ముందు సంకేతాలు ఇలా కనిపిస్తాయి.

శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త ఆయన పరమేశ్వరుడిని ఇలా అడిగింది.స్వామి మరణానికి సంకేతం ఏంటి మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించినప్పుడు మహా శివుడు ఇలా సెలవిచ్చాడు.

ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలలో చనిపోవచ్చని అర్థం చేసుకోవచ్చు.ప్రతి వస్తువు నల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే చనిపోతున్నాడని సంకేతం.

వారం రోజులపాటు ఎడమ చేయి తిరిగిపోతున్నట్లు అనిపిస్తున్న కూడా త్వరలోనే చనిపోతున్నాడని అర్థం చేసుకోవచ్చు.

నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ మనిషి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. చంద్రుడు, సూర్యుడు, అగ్నికాంతిని చూడలేనప్పుడు ఇక ఆ మనిషి జీవించేది ఆరు నెలలు అని అర్థం చేసుకోవచ్చు.నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాలలో చీము వస్తే ఆరు నెలలకు మించి బతకడం కష్టమే అని చెబుతారు.

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని ఎరుపు రంగులోనే కనిపించిన త్వరలోనే మరణం సంభవించే అవకాశం ఉందని చెప్పవచ్చు.గుడ్లగూబ గురించి కలలో కనపడినప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ, ధ్వంసం చేసినట్లుగానే కళ వస్తే మృత్యు సమీపించినట్లే అని మహా శివుడు చెబుతాడు.కాకి, గద్ద తలపై కూర్చున్న వాలిన అది మరణ సంకేతమే.చనిపోయే ముందు రోజు పార్వతీ, పరమేశ్వరులు పరామర్శించే అవకాశం ఉందని కూడా చెబుతారు.రెండు పిచ్చుకలు నీళ్లలో మునిగితే మీ ప్రాణం గాలిలొ కలిసిపోతుంది అని కూడా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube