స్కిన్ వైట్నింగ్ కోసం అధిక శాతం మంది మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్ పైనే ఆధారపడుతుంటారు.ఈ క్రమంలోనే వాటికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ను రోజు కనుక వాడితే స్కిన్ ఫైటింగ్ తో పాటు మరిన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది నుంచి పదిహేను బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే బాదం పప్పుకు ఉన్న పొట్టును తొలగించాలి.పొట్టు తొలగించిన బాదంను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో బాదం పాలను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బాదం పాలు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో నాలుగైదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మన నైట్ క్రీమ్ సిద్ధమవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించి వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను అప్లై చేసుకుని నిద్రించాలి.ఈ క్రీమ్ ను రోజు వాడితే ముఖం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.
చర్మంపై ఏమైన మొండి మచ్చలు ఉంటే క్రమంగా దూరమవుతాయి.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.
చర్మం యవ్వనంగా మరియు షైనీ గా సైతం మెరుస్తుంది.







