అది “చంద్రబాబు” గొంతే..ఫోరెన్సిక్ నిర్ధారణ త్వరలో..

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.ఈ కేసుకు సంభందించి ఫోన్ సంభాషణలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

 Otuku Note Crime Forensic Shocking-TeluguStop.com

అయితే ఈ కేసుకు సంభందించిన ప్రతీ విషయం ఇప్పుడు అమిత్ షా కనుసన్నలలో ఉంది అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.చంద్రబాబు అరెస్టు తప్పదని.

ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు సైతం సోషల్ మీడియాలో రావడంతో మరో మారు ఈ కేసు ఆసక్తి కరంగా మారింది.

“మనవాళ్ళు బ్రీఫిడ్ మీ” అన్న మాటలు చంద్రబాబు వేనని తేలడంతో ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి.అయితే ఒక వేళ అరెస్టు గనుకా అనివార్యం అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది.పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు స్థాయిలో పార్టీని నిలబెట్టగలిగే వ్యవస్థ గానీ వ్యక్తులు గానీ పార్టీలో లేరని అంటున్నారు విశ్లేషకులు.

రేవంత్ రెడ్డి వరకే ఇప్పటి వరకు ఈ కేసు పరిమితమైంది…ఇక మీదట విచారణలో భాగంగానే చంద్రబాబు టార్గెట్ గా ఈ కేసు వెళ్ళబోతోంది అంటున్నారు.

ఇదిలాఉంటే ఇదే విషయంపై తెలుగుదేశం నేతలు స్పందిస్తూ ఇదంతా వైసీపి పెయిడ్ మీడియా పన్నుతున్న కుట్రగా కొట్టిపారేస్తున్నారు.

కావాలని తెలుగుదేశం పార్టీ పరువు తీయడమే టార్గెట్ గా పెట్టుకుంది అంటూ ఫైర్ అవుతున్నారు.అయితే

అయితే ఇందులో నిజం ఏంటి? సాధ్యాసాధ్యాలు ఏంటి? అంటే వివరాలలోకి వెళ్తే.

నిజంగానే ఫోరెన్సిక్ నివేదిక వచ్చి ఉంటే కేవలం తెలంగాణా పత్రికకు, వైకాపా సంభందించిన పెయిడ్ మీడియాకు తప్ప ఎవరికీ కూడా ఎందుకు తెలియదు ఈ విషయం.అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది…అంతే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు ఎందుకు ఈ విషయానికి సంభందించి లేవు.

ఒక వేళ అది నిజంగానే చంద్రబాబు గొంతు అయితే.ఆ మాటల్లో చంద్రబాబు స్టీఫెన్ సన్ ని ఎక్కడా కూడా ప్రలోభ పెట్టేలా మాట్లాడలేదు.సరికదా మీరు మీ నిర్ణయాన్ని స్వేచ్చగా తీసుకోండి అంటూ తెలిపారు.ఇదిలాఉంటే మే 15 తరువాత చంద్రబాబు లోకేష్ లు అరెస్టు అవుతారు అని చెప్పడం అది కూడా ముందు బీజేపి , తరువాత వైసీపి నేతలు చెప్పడంతో చంద్రబాబు పై కుట్ర పూరితంగానే అరెస్టులకి కేంద్రం రంగం సిద్డం చేస్తోందని అనుకోవాలా అనే సందేహాలు కలిగేలా చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube