సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) మూవీ విడుదల కావడానికి మరి కొద్ది రోజుల సమయం ఉంది.అయితే విడుదల తేదీకి పట్టుమని వారం రోజులు కూడా లేకపోవడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
అలాగే ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతున్న కూడా ఇంకా టికెట్ల బుకింగ్ ఓపెన్ కాకపోవడంతో అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు.
ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుందని అలాగే కోటల్లో కలెక్షన్స్ ని సాధిస్తుందని మూవీ మేకర్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర సీడెడ్ నైజాం కలిపి ఎంత వసూలు సాధించాలి అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఆంధ్రలో( Andhra ) 90 కోట్ల మేరకు, నైజాంలో( Nizam ) 100 కోట్లు, సీడెడ్( Ceded ) లో 30 కోట్లకు పుష్ప 2 సినిమాను బయ్యర్లకు విక్రయించారు.18శాతం జిఎస్టీలు, థియేటర్ రెంట్లు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇరవై శాతం కమిషన్ అన్నీ తీసేయగా 220 కోట్లు రావాల్సి వుంటుంది.
అంటే దాదాపు 450 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి వుంటుంది.ఇది నిజంగా చాలా పెద్ద ఫీట్ అని చెప్పాలి.అంతే ఈ సినిమాకు దగ్గరగా బాహుబలి ఆర్ఆర్ఆర్ రేంజ్ కలెక్షన్ రావాలన్నమాట.
కానీ పుష్ప సినిమా అన్ని కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందా అని కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.పుష్ప వన్ కు నిర్మాతలు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది.
అప్పుడు రేట్లకు ఇప్పుడు రేట్లు డబుల్.మరి సినిమా డబుల్ రేంజ్ హిట్ కావాలి.
ఫ్యామిలీలు తరలి రావాలి, చాలా పెద్ద టాస్క్ ఇది.