ముఖ్యంగా చెప్పాలంటే హార్ట్ పంపు సరిగ్గా పని చేయాలంటే కొన్ని పనులను కచ్చితంగా చేయాలి.తద్వారా రక్త ప్రసరణ( blood circulation ) సక్రమంగా జరుగుతుంది.
ఇందుకోసం ప్రతి రోజు ఒక ఆపిల్ తినాలని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఈ పండు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అలాగే ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి.దీనివల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది.
సాధారణ హృదయ స్పందన ఆరోగ్యకరమైన హృదయానికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.గుండె రక్తాన్ని పంపిణీ చేస్తున్నంతకాలం మీ గుండెచప్పుడు మీరు చాలా సార్లు వినవచ్చు.
గుండె యొక్క గదులు పనిచేయడం ఆగిపోయినప్పుడు పంపింగ్ చేయడం కూడా తగ్గిపోతుంది.

దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు( Heart problems ) వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే పనిని చేస్తాయి.అయితే గుండె దాదాపు శరీరం మూలలకు రక్తాన్ని అందజేస్తుంది.
గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.తగ్గిన పంపింగ్ కారణంగా ఆక్సిజన్ కొన్ని అవాయవాలకు చేరదు.
గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు ప్రతి రోజు ఒక ఆపిల్ పండు( Apple ) తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.ప్రతి రోజు అల్పాహారం మరియు భోజనం మధ్య ఈ పండు తీసుకోవాలి.
ఇంకా చెప్పాలంటే ఈ పండు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుంది.

కానీ దానితో పాటు ప్రతి రోజు సరైన శరీరక శ్రమ కచ్చితంగా ఉండాలి.ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.అధిక మొత్తంలో ఉప్పు తీసుకోకూడదు.
దీని కారణంగా ఆ శరీరంలోనీ వివిధ భాగాలలో నీరు చేరడం మొదలవుతుంది.దీని కారణంగా గుండె పై ఒత్తిడి( stress ) పడుతుంది.
ఒత్తిడి శరీరానికి ఎప్పుడు హానికరమే అని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి.
మీరు నిరంతరం బరువు పెరుగుతూ ఉంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు.గుండె సరిగ్గా రక్తాన్ని పిప్ చెయ్యడానికి బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యమైన నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి గుండెకు హాని కలిగించే వీటికి దూరంగా ఉండడమే మంచిది.