భిక్కనూరులో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి మరీ కేసీఆర్ తెలంగాణ సాధించుకుని వచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.
మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.గత ప్రభుత్వాలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీడీ కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.సౌభాగ్యలక్ష్మీ పేరుతో మహిళలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఆసరా పెన్షన్ లను రూ.5 వేలు అందిస్తామని తెలిపారు.రూ.400 గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న కేటీఆర్ తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.తెల్లరేషన్ కార్డు దారులకు రూ.5 లక్షల బీమా ఇస్తామని, అసైన్డ్ భూములు ఉన్నవారికి పూర్తి అధికారం ఇస్తామని తెలిపారు.







