మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో( Over Weight ) బాధపడుతున్నారు.బరువు పెరగడం వల్ల బాడీ షేప్ అవుట్ అవ్వడమే కాకుండా మరెన్నో జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
ఈ క్రమంలోనే బరువు తగ్గి స్లిమ్ గా మారాలని భావిస్తుంటారు.ఫుడ్ విషయంలో నియమాలు పెట్టుకుంటారు.
నిత్యం వ్యాయామం చేస్తుంటారు.వెయిట్ లాస్ అవ్వాలని తపిస్తుంటారు.
అయితే అలాంటి వారు తమ బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే రెసిపీని చేర్చుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.ఇంతకీ రెసిపీ ఏమిటంటే.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్,( Chia Seeds ) ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు( Coconut Milk ) వేసుకుని కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే నానబెట్టుకున్న చియా సీడ్స్ లో మరికొన్ని కొబ్బరి పాలు, ఒక కప్పు దానిమ్మ గింజలు, ఒక కప్పు సపోటా పండు ముక్కలు వేసుకుని కలుపుకోవాలి.
ఆపై వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన బాదం పప్పు వేసుకుని బాగా కలిపితే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ సిద్ధం అయినట్లు.
ఈ చియా సీడ్ పుడ్డింగ్( Chia Seed Pudding ) చేసుకోవడం చాలా సులభం.పైగా ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.బ్రేక్ ఫాస్ట్ లో( Breakfast ) ఈ చియా సీడ్ పుడ్డింగ్ ను కనక చేర్చుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.వెయిట్ లాస్( Weight Loss ) అయ్యి స్లిమ్ గా మారాలని భావిస్తున్న వారికి ఈ చియా సీడ్ పుడ్డింగ్ చాలా బాగా సహాయపడుతుంది.
పైగా కొబ్బరిపాలు, చియా సీడ్స్, దానిమ్మ గింజలు, సపోటా, బాదం, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు ఇవన్నీ మన ఆరోగ్యానికి అనే విధాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.మెదడు చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తాయి.
ఎముకలను దృఢంగా మారుస్తాయి.కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి.
మరియు శరీరానికి బోలెడంత శక్తిని అందించి రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.