భారత క్రికెట్ ఆటగాళ్లకు ఘోర అవమానం..

టీమిండియా ఆటగాళ్లకు ఈ ఏడాది అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి.2022లో భారత క్రికెట్ జట్టు మంచి విజయాలను సొంతం చేసుకుంటుందనుకుంటే ఘోరంగా విఫలం అయ్యింది.దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలయింది.ఈ టెస్ట్ సిరీస్ ఆడుతున్న సందర్భంలో కోహ్లీ పిల్ల చేష్టలు చేసి ఎన్నడూ రాని విధంగా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు.

 Shame On Indian Cricketers, Indian Players, Latest News, Keeper Mohammad Rizwan,-TeluguStop.com

ఈ ఏడాది మాత్రమే కాదు గతేడాదిలో కూడా టీమిండియా రాణించిన దాఖలాలు కనిపించలేదు.ప్రధానంగా టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూప్ దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టింది.

ఇక మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇదే ఆట తీరు కొనసాగించింది.అలా పర్ఫామెన్స్ పరంగా చెత్త టీంగా పేరు తెచ్చుకున్న ఇండియా ఇప్పుడు మళ్లీ అవమానమే ఎదుర్కొంటోంది.

తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2021 ఏడాదికిగానూ పురుషుల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ జాబితాను విడుదల చేసింది.ఇందులో మొత్తం 11 ప్లేయర్లకు అరుదైన గౌరవం అందించింది.

అయితే ఈ జాబితాలో ఒక్క టీమిండియా ఆటగాడు కూడా చోటు దక్కించుకోకపోవడం ఇప్పుడు అందర్నీ విస్తుపరుస్తోంది.మరోవైపు టీమిండియా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టులోని ముగ్గురు ప్లేయర్లు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

ఆ ముగ్గురిలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా ఉన్నాడు.బాబర్‌ ఆజమ్‌తో పాటు పాక్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

Telugu Indian, Keepermohammad, Pakistanpacer, Ups-Latest News - Telugu

ఐసీసీ సంస్థ తొలి స్థానానికి జోస్‌ బట్లర్‌ ను, రెండో స్థానానికి మహ్మద్‌ రిజ్వాన్‌ను, మూడో స్థానానికి బాబర్‌ ఆజమ్‌ను, నాలుగో స్థానానికి మార్క్రమ్‌(సౌతాఫ్రికా)ను ఐదో స్థానానికి మిచెల్‌ మార్ష్‌(ఆస్ట్రేలియా)ని ఎంపిక చేసింది.ఆ తరువాత స్థానాల్లో వరుసగా డేవిడ్‌ మిల్లర్‌ (సౌతాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్‌ షంషి(సౌతాఫ్రికా), జోష్‌ హేజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), షాహీన్‌ అఫ్రిది(పాకిస్థాన్‌)లను సెలెక్ట్ చేసింది.టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో టీమిండియా ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో అందర్నీ నిరాశపరిచిన విషయం తెలిసిందే.ఆ కారణంగానే ఇప్పుడు ఐసీసీ ఇండియన్ ఆటగాళ్లకు టీం ఆఫ్ ది ఇయర్ లో ఎలాంటి స్థానం కల్పించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube