కూతురిని హీరోయిన్ ని చేయాలనుకున్న తల్లి...దాంతో ఏకంగా... 

ఈ మధ్యకాలంలో కొందరు ఇతరుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ తన కూతురిని హీరోయిన్ చేయాలనుకుంటుండగా ఓ వ్యక్తి ఏకంగా తాను సీరియల్ డైరెక్టర్లతో మరియు సినిమా నిర్మాతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆమెతో దాదాపుగా మూడు లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి చేతులెత్తేసిన ఘటన వడదోర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 Women Cheated By 3 Lakh Rupees In Vadodara, Vadodara, Crime News, Women Cheated-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఈ మహిళ కి చిన్నప్పటి నుంచి నటి కావాలని ఎంతో ఆశగా ఉండేది.

కానీ కుటుంబ సభ్యులు ఆమె ఆశని నెరవేరకుండా చేశారు.దీంతో ఎలాగైనా తన కూతురిని వెండి తెరపై చూసుకోవాలని మురిసి పోయింది.

దీంతో మహిళ కోరికని పసిగట్టినటువంటి ఓ వ్యక్తి తనకు సినిమా పరిశ్రమలో పలువురు డైరెక్టర్లు మరియు నిర్మాతలు తెలుసని తాను అడిగినంత డబ్బు ఇస్తే తన కూతురికి సినిమా అవకాశం వచ్చే విధంగా చూస్తానని నమ్మబలికాడు.దీంతో మహిళ కష్టపడి దాచుకున్న మూడు లక్షల రూపాయలను అతడి చేతిలో పెట్టింది.

దీంతో కొద్దిరోజుల పాటు ఆ వ్యక్తి తనకు గడువు కావాలని తాను తన కూతురి అవకాశం ప్రయత్నంలోనే ఉన్నానంటూ నమ్మించాడు.క్రమక్రమంగా వ్యక్తి మాటలలో తేడా రావడంతో మహిళ తన డబ్బు తనకి తిరిగి ఇవ్వమని అడిగింది.

అయినప్పటికీ ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని కోరింది.దీంతో బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సినిమా అవకాశం ఇప్పిస్తానని ఆర్థిక మోసానికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube