హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.చందానగర్ లో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బలవన్మరణం చెందారు.రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ -18లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు.
ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.