జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఎన్ని వాగ్దానాలు చేసినా ,ఎన్ని అరుపులు అరిచినా ,రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా .’సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’.
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది.అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ఇక ఇదే తరుణంలో అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరియు రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్లు జీతాలు సకాలంలో ఇవ్వడంలేదని.పవన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ తెలుగు ఒకటో తారీఖున జీతాలు వస్తాయన్న విషయం కూడా మర్చిపోయారని జీతాలు పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో అయోమయంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అన్నట్టు పేర్కొన్నారు.ముఖ్యంగా రిటైర్డు ఉద్యోగస్తులకి పెన్షన్లు సకాలంలో అందకపోవటం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పెన్షన్ డబ్బులు ఆధారమని వారి సమస్యలను తీర్చాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.

పోలీసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గత ఏడాది కంటే పెరిగాయని ఈ క్రమంలో జీతభత్యాల చెల్లింపు. ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు.