శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల.మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుస అవకాశాలు తలుపు తట్టాయి.
ఈ విధంగా శ్రీ లీల ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 7 సినిమాలను చేతిలో పెట్టుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇన్ని అవకాశాలను అందుకున్న హీరోయిన్ గా శ్రీ లీల పేరు సంపాదించింది.
ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారని చెప్పాలి.ఈయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించినందుకే తనకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయని నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనేనంటూ ఈమె వెల్లడించారు.

తనని ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్ర రావు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని శ్రీ లీల వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె మహేష్ బాబు, రవితేజ, శర్వానంద్, బాలకృష్ణ, నితిన్ వంటి హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ విధంగా కుర్ర హీరోల నుంచి స్టార్ సెలబ్రిటీల సినిమాలకు ఈమె మొదటి ఆప్షన్ అయ్యారు.ఏదిఏమైనా శ్రీ లీల తన అందచందాలతోనూ నటన నైపుణ్యంతో వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.