ప్రజాసేవే నా లక్ష్యం:గొంగిడి

యాదాద్రి జిల్లా:ప్రజా సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యమని ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రకటించారు.గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో నూతన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి,పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి,హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Public Service Is My Aim: Gongidi-TeluguStop.com

పట్టణంలోని వాడ వాడలా తిరుగుతూ పలు సమస్యలను పరిశీలించారు.యాదగిరిపల్లి అంగన్వాడీ కేంద్రాన్న పరిశీలించి,అక్కడి పిల్లలతో కలిసి భోజనం చేసి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు.

అనంతర ఆమె మాట్లాడుతూ సీఎం ప్రత్యేక నిధుల ద్వారా యాబై లక్షల రూపాయలతో యాదగిరిగుట్ట పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు జెడ్పిటిసి తోటకూరి అనురాధ,స్థానిక మునిసిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, బూడిద సురేందర్,తాళ్లపల్లి నాగరాజు,ఆవుల మమతా సాయి యాదవ్,దండబోయిన అనిల్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పెళ్లిమెల్లి శ్రీధర్ గౌడ్,పాపట్ల నరహరి,టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ముక్కెర్లల సతీష్ యాదవ్,సుడుగు శ్రీనివాస్ రెడ్డి,మిట్ట వెంకటయ్య,సిక శీను,గోర్ల పద్మ, బండ రామస్వామి యాదవ్,ముక్కెర్ల శ్రీశైలంయాదవ్, కిసరి బాలరాజు గౌడ్,గుండ్లపల్లి లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube