అక్కినేని అఖిల్( Akhil ) ఏజెంట్ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కింది.
సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా బడ్జెట్ పెట్టేశారు నిర్మాత అనీల్ సుంకర.ఈ సినిమా విషయంలో నాగార్జున( Nagarjuna ) అసలేమాత్రం ఇన్వాల్వ్ అవలేదు.
అఖిల్ కెరీర్ లో మొదట ఒకటి రెండు సినిమాలకు నాగార్జున వెనక ఉన్నారు.బ్యాచిలర్ సినిమా సక్సెస్ అవడంతో అఖిల్ ఇక తన కెరీర్ తనే చూసుకుంటున్నాడు.

ఏజెంట్ సినిమా( Agent Movie ) విషయంలో నాగ్ అసలు పట్టించుకోలేదని తెలుస్తుంది.సినిమాలో ఇన్వాల్వ్ అవలేదు సరే కనీసం ట్రైలర్ రిలీజ్ టైం లో అయినా ఒక కామెంట్ వేస్తే బాగుండేది కదా అని అంటున్నారు.అక్కినేని ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు అఖిల్ సిద్ధం అవుతున్నాడు.ఏజెంట్ లో అతని సాహసాలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం పక్కా అనిపిస్తుంది.

ఏజెంట్ సినిమాపై నాగ్ సైలెన్స్ ఎందుకు అన్నది తెలియాల్సి ఉంది.రిలీజ్ మరో వారం ఉంది అనగా ఏజెంట్ సినిమాకు నాగార్జున తన సపోర్ట్ అందిస్తారా లేక రిలీజ్ వరకు ఇలానే ఉంటారా అన్నది చూడాలి.ఏజెంట్ సినిమా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సోలోగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్.







