వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా, మీరు విన్నది అక్షరాలా నిజం.ఇదే విషయం ఇపుడు వైరల్ గా మారింది.
దేశంలో వున్న కోతులతోనే పడలేము, పైగా పొగురుదేశం నుండి కోతుల( Monkeys ) ఎగుమతి ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? అయితే దీని వెనుక పెద్ద విషయం వుంది లెండి.అంతరించిపోతున్న జాతుల లిస్టులోకి తోక్ మకాన్ జాతి కోతులు చేరిపోయాయనే విషయం మీకు తెలుసా? ఇపుడు ఇదే జాతి కోతుల్ని చైనా శ్రీలంక( China Sri Lanka ) నుండి దిగుమతి చేసుకోవాలని సన్నాహాలు చేస్తోంది.

ఇకపోతే ఈ ప్రత్యేక జాతి వానరాలు కేవలం శ్రీలంకలోనే మనకు విరివిగా కనిపిస్తాయి.కోతులను సేకరించాలనే చైనా అభ్యర్థనపై శ్రీలంక వ్యవసాయ శాఖ మంత్రి మహేందర్ అమర్ వీర తాజాగా స్పందించారు.చైనాలోని 1000జూలలో ప్రదర్శించడానికి దాదాపు లక్ష కోతులు వరకు కావాలని చైనా కోరిందని అమరవీరా ఈ సందర్భంగా తెలిపారు.అయితే వీటిని ఉచితంగా పంపిస్తారా లేదా కొనుగోలు చేసుకుంటారా అనే విషయం మీద స్పష్టత రావలసి వుంది.

మీకు తెలుసో లేదో కానీ ఆంజనేయస్వామి సీత జాడను కనుక్కోవడానికి లంకకు వెళ్ళిన తరువాత కొన్ని వానర జాతులు వెనక్కి వచ్చేస్తే, మిగతా జాతి శ్రీలంకలో సెటిలైపోయాయని ఓ ప్రచారం.అలాంటి పవిత్రమైన శ్రీలంకలో ప్రత్యేకత కలిగిన ఈ వానరజాతిని చైనాకి పంపిస్తే అక్కడ జూలలో ప్రదర్శించడం ఏమో కానీ, ముందు వాటిని కూడా కోసుకుని తినేస్తారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపైనే శ్రీలంక కొన్ని కమిటీలు వేసుకొని రీసెర్చ్ చేస్తోందని సమాచారం.కాగా దీనిపై శ్రీలంక ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని జంతు ప్రేమికుల అభిప్రాయ పడుతున్నారు.ఎందుకంటే ఈ ప్రత్యేక జాతి వానరాలను చైనాకి పంపించాలని అనుకుంటే, ఆ వానర జాతిని కాపాడటానికి హనుమంతుడే దిగి రావాలిసి ఉంటుందని కొంతమంది భక్తులు కామెంట్లు చేస్తున్నారు.మరి శ్రీలంక ఈ ఎగుమతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.







