రెడ్ బుక్ పై లోకేష్ ఏమంటున్నారంటే ..? 

గత వైసిపి ప్రభుత్వ హయంలో టిడిపి నేతలను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడిన నాయకులు అధికారుల ను హెచ్చరిస్తూ అప్పట్లోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్( Nara Lokesh Red Book ) వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు .తమపై వేధింపులకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టబోమని,  అందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామంటూ హెచ్చరికలు చేశారు.

 Nara Lokesh Interesting Comments About Red Book Details, Nara Lokesh, Red Book,-TeluguStop.com

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బుక్ లో ఉన్న అందరిపైనా చర్యలు ఉంటాయి అంటూ అప్పట్లోనే లోకేష్ అన్నారు.దీనిపై అప్పట్లో లోకేష్ పై వైసీపీ నేతలు( YCP Leaders ) అనేక సెటైర్లు వేశారు. 

Telugu Chandrababu, Cm Chandrababu, Jagan, Lokesh, Lokesh Red, Pavan Kalyan, Red

అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లుగానే లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న వారి అవినీతి వ్యవహారాలను బయటకు తీస్తూ,  వారిని టార్గెట్ చేసుకోవడంతో ఈ రెడ్ బుక్ అంశం పదేపదే చర్చనీయాంశంగా మారింది.తాజాగా మరోసారి రేట్ బుక్ ప్రస్తావన తెరపైకి వచ్చింది.వైసిపి అధినేత జగన్( YS Jagan ) ఎక్కడ పర్యటించినా రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.రెడ్ బుక్ ద్వారా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జగన్ చేస్తున్న విమర్శలకు తాజాగా నారా లోకేష్ స్పందించారు.

ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ అన్నారు.

Telugu Chandrababu, Cm Chandrababu, Jagan, Lokesh, Lokesh Red, Pavan Kalyan, Red

మంగళగిరిలో నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన తరువాత మాట్లాడిన లోకేష్ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన ఐపీఎస్ ల పైన నివేదిక రాగానే వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని , రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని లోకేష్ హెచ్చరించారు.ఇప్పటికే వైసీపీ నేతలు రెడ్ బుక్ అంశంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని , దీనిలో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా, తాజాగా లోకేష్ రెడ్ బుక్ పై ఇలా స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube