విరిగిపోయే దశలో ఉన్న విద్యుత్ స్తంభం ఎవరికి పొంచి ఉందో ప్రమాదం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డే కేర్ సెంటర్ కు ఎదురుగా గల ఇర్ఫాన్ కిరాణా దుకాణం పక్కన విద్యుత్ స్తంభం పూర్తిగా పెచ్చులు ఊడి ఉంది.
ఇట్టి విద్యుత్ స్తంభానికి ఎలాంటి విద్యుత్ కనెక్షన్ కూడా లేదు.వరుసగా కురుస్తున్న ముసురుకు ఇట్టి స్తంభం గాలికి ఊగులాడుతూ ఉంది.
నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభం ను ఎవరి మీద పడక ముందే తొలగించి ప్రమాదాన్ని నివారించాలని సెస్ ఏ ఈ పృథ్వి ధర్ ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు అక్కడి వార్డు ప్రజలు కోరుతున్నారు.