అమెజాన్ ప్యాకేజీలో రాకాసి బల్లి.. షాకైన కొలంబియా మహిళ..
TeluguStop.com
కొలంబియా( Colombia ) దేశంలో నివసించే సోఫియా సెర్రానో అనే మహిళకు అమెజాన్ టీమ్ పెద్ద షాక్ ఇచ్చింది.
ఆమె ఇటీవల అమెజాన్‌లో ఓ ఎయిర్ ఫ్రైయర్ (ఆహారం వేయించేందుకు ఉపయోగించే ఒక పాత్ర) ఆర్డర్ చేసింది.
అయితే ఆమెకు డెలివర్ అయిన పార్సెల్ ప్యాకేజీలో ఎయిర్ ఫ్రైయర్‌కు బదులు ఒక పెద్ద రాకాసి బల్లి కనిపించింది.
సోఫియా తనకు జరిగిన ఈ విచిత్ర సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో, ఇది నెట్‌లో వైరల్‌గా మారింది.చాలా మంది ఈ విషయాన్ని చూసి నవ్వుకున్నారు, మరికొందరు ఆమె పరిస్థితిని చూసి అయ్యో పాపం అని కామెంట్లు చేశారు.
"""/" /
సోఫియా తనకు జరిగిన ఈ విచిత్ర సంఘటనను సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేసింది.
ఆమె "మేం అమెజాన్ ద్వారా ఒక ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ చేశాం, కానీ దానికి బదులు కొత్త ఫ్రెండ్ వచ్చింది.
ఈ మాన్‌స్టర్ లిజార్డ్ బాక్స్ లోపలికి ఎలా వెళ్ళిందో తెలియ రాలేదు.ఇది అమెజాన్ తప్పా లేక పార్సెల్ తీసుకెళ్లే వారి తప్పా తెలియదు.
" అని తన పోస్టులో పేర్కొంది. """/" /
ఆర్డర్ చేసిన ఎయిర్ ఫ్రైయర్‌కు బదులుగా బల్లి వచ్చిందంటే, ఆమె ఎంత భయపడి ఉంటుందో ఉంచించుకోండి.
అదే ఏ విషపురితమైన పాము అందులో ఉండి ఆమెను కాటేస్తే ఏమై ఉండేది? ఇది చాలా సీరియస్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు.
ఆ పార్సెల్‌లో వచ్చినది స్పానిష్ రాక్ లిజర్డ్ అని అందరు చెప్పారు.అది స్పెయిన్ దేశంలో కనిపించే రకమైన బల్లి.
అయితే పార్సెల్‌ను డెలివరీ చేసిన కంపెనీ నుంచి సోఫియాకు ఏ విధమైన సమాధానం రాలేదు.
సోఫియా తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్‌గా మారిపోయింది.
లక్షలాది మంది ఈ పోస్ట్‌ను చూశారు.చాలామంది ఈ విషయం గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఒకరు, "ఇలా జరిగితే నేను చచ్చిపోయేదాన్ని.కానీ, ఆ చిన్న జంతువుపై కూడా జాలి వేస్తుంది.
అది భయపడి, ఆకలితో, దాహంతో ఉంటుందేమో" అని రాశారు.మరొకరు, "ఇప్పుడు నాకు కొత్త భయం పుట్టింది" అని కామెంట్ చేశారు.