వాళ్ల కోసం ఏకంగా 35 లక్షల రూపాయలు డొనేట్ చేసిన ప్రభాస్.. రియల్ హీరో అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Prabhas Donated 35 Laksh To Telugu Film Directors Association Director Maruthi A-TeluguStop.com

అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.కాగా గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ కల్కి,( Kalki ) రాజా సాబ్,( Rajasaab ) సలార్ 2 లాంటి సినిమాలలో నటిస్తూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.

ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే.షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తాడు.

Telugu Dasari Yana Rao, Maruthi, Prabhas, Prabhas Donate, Prabhas Lakhs, Tollywo

ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.ఇక ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు.డొనేషన్స్ కూడా ఇచ్చారు.కానీ తాను డొనేషన్స్ ఇచ్చిన వాటిలో కేవలం కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి.దీంతో ఆ విషయాలు తెలుసుకున్న చాలామంది ప్రభాస్ సహాయం చేసి పబ్లిసిటీ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.తాజాగా ప్రభాస్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి( Telugu Film Directors Association ) డొనేషన్ ఇచ్చారు.

త్వరలో మే 4న దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు.

Telugu Dasari Yana Rao, Maruthi, Prabhas, Prabhas Donate, Prabhas Lakhs, Tollywo

స్టేడియంలో భారీ జనల మధ్య టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా హాజరవ్వగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయబోతున్నారు.దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం నిన్న రాత్రి జరగ్గా ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు.ఈ కార్యరామంలో దర్శకుడు మారుతి( Director Maruthi ) మాట్లాడుతూ.

మన డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ గారు 35 లక్షలు ప్రకటించారు.ఇందాకే కాల్ చేసి ప్రభాస్ గారు మాట్లాడి 35 లక్షలు ఇస్తానని చెప్పినట్టు తెలిపారు.

దీంతో ప్రభాస్ పై దర్శకుల సంఘం అభినందనలు కురిపించారు.ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు మరోసారి ప్రభాస్ మంచి మనసుని అభినందిస్తున్నారు.

ప్రభాస్ పై ప్రశాంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube