న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీటీడీ వెబ్ సైట్ లో రిఫండింగ్ ట్రాకర్

శ్రీవారి దర్శనం కోసం వచ్చి గదులు పొందిన భక్తులకు రిఫండ్ సమాచారాన్ని ప్రస్తుతం ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నామని,  త్వరలో దీన్ని ట్రాక్ చేసేందుకు అధికారిక వెబ్సైట్ లో ట్రాక్టర్ ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com

2.దక్షిణ మధ్య రైల్వే సమాచారం

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి లో భాగంగా రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

3.పురందేశ్వరి డిమాండ్

పేదలకు వారి సొంత ప్రాంతాల్లోని ఇళ్లు నిర్మించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

4.మంగళగిరి కోర్టుకు నారా లోకేష్

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh 0 ఈరోజు మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.

5.చంద్రబాబు పర్యటనలో.

టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరు లో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.అలాగే నల్ల జెండాలతో నిరసన తెలిపాయి.

6.అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

ప్రభుత్వం నుంచి అసైండ్ భూములు పొంది 20 ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

7.పంచాయతీ నిధులు మళ్లింపు పై దర్యాప్తు చేయించండి

కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన 860 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్ళించి సొంత పథకాలకు వినియోగించుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు  ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

8.ఆక్వా రైతులంతా సంతోషంగా ఉన్నారు

ఆఖరములు ధరలను క్రమబద్ధీకరించడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,  అప్పలరాజు,  కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

9.కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

పరువు నష్టం కేసులు రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

10.జులైలో టిటిడి ఆదాయం

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

జులై నెలకు సంబంధించి తలనీలాల విక్రయం ద్వారా తిరుమలకు 14 కోట్ల ఆదాయం లభించింది అని దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.

11.ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో పోస్టులు

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్, మిలటరీ స్టేషన్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది.

12.వరద నష్టం పరిహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

తెలంగాణలో వరద నష్టం పరిహారంపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.ప్రభుత్వ తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

13.దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆవేదన

<

న్యాయం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు సేజల్ తను పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు.

14.ఇండియా కోటమిపై మోది సెటైర్లు

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు అయిన ప్రతిపక్ష కూటమి ఇండియాకు ప్రధాన నరేంద్ర మోది( Narendra Modi ) కొత్త పేరు పెట్టారు.‘ ఘమిండియా ‘ పేరుతో పిలవాలని పిలుపునిచ్చారు.

15.మంత్రి దాడిశెట్టి రాజాకు మాతృ వియోగం

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తల్లి సత్యనారాయణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

16.ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లకు వెబ్ ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.

17.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి.సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి .అయితే అసెంబ్లీ బయట మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది .ఉదయం పలు సంఘాల నేతలు విడతల వారీగా వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

18.పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించండి

పంచాయతీ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

19.ఈటెలపై కేటీఆర్ సెటైర్లు

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

బిజెపిలోకి వెళ్ళవు కంపెనీ మూత పడింది అంటూ అసెంబ్లీలో ఈటెల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,950

Telugu Amith Sha, Ap Cm Jagan, Ap, Arun Kumar Jain, Chandrababu, Janasena, Modhi

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,950

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube