హైదరాబాద్‌లో అనేక విలాసవంతమైన రెస్టారెంట్లు ఉన్నాయి.అయితే, కొన్నింటిని మన టాలీవుడ్ ప్రముఖులే నిర్వహిస్తున్నారని మీకు తెలుసా? ఇక వీటి ప్రత్యేకత ఏమిటంటే.లగ్జరీతో పాటు, భిన్నమైన వంటకాలతో ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందిస్తాయి.తెలుగు సినీ పరిశ్రమకి చెందిన స్టార్లు స్థాపించిన ఈ రెస్టారెంట్ల గురించి తెలుసుకొని.మీ ఫేవరేట్ హీరో రెస్టారెంట్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.ఇందులో మొదటగా శాంక్చువరీ – బార్ అండ్ కిచెన్ ఒకటి.
ఇది రానా దగ్గుబాటికి( Rana Daggubati ) సంబంధించినది.ఇది ఫిల్మ్ నగర్, హైదరాబాద్ లో ఉంది.
ఈ హోటల్లో ప్రత్యేకత ఏమిటంటే.విలాసవంతమైన డైనింగ్ అనుభవం, ప్రైవేట్ డైనింగ్ గదులు, బార్.
నిజానికి ఈ ప్రదేశం రానా దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత ఇల్లును రెనోవేట్ చేసి రెస్టారెంట్‌గా మార్చారు.ఇది ఎప్పుడూ జనంతో నిండుగా ఉంటుంది.

ఇక ఈ లిస్ట్ లో బఫెలో వైల్డ్ వింగ్స్( Buffalo Wild Wings ) ఒకటి.దీనికి యజమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.( Allu Arjun ) దీని ప్రత్యేకత ఏమిటంటే స్పోర్ట్స్ బార్, చికెన్ వింగ్స్, సిగ్నేచర్ సాస్‌లు, గ్రిల్డ్ ఫిష్.అలాగే ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాకుండా.
ఒక స్పోర్ట్స్ బార్ కూడా.రుచికరమైన చికెన్ వింగ్స్ కోసం ఇది బాగా ఫేమస్.
మరొక రెస్టారెంట్ విషయానికి వస్తే.గుడ్ వైబ్స్ ఓన్లీ కాఫీ.
( Good Vibes Only Coffee ) దీనికి యజమాని ఆనంద్ దేవరకొండ.( Anand Devarakonda ) ఇందులో ప్రత్యేకత విషయానికి వస్తే.
ఇక్కడ హై-క్వాలిటీ కాఫీ, విభిన్నరుచులైన బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు లభిస్తాయి.అలాగే కూర్గ్ నుండి ప్రత్యేకంగా తెప్పించే కాఫీ బీన్స్‌తో ఇక్కడ కాఫీ తయారవుతుంది.
ఇది ప్రత్యేకమైన రుచి కలిగి ఉండడమే ఒక ప్రత్యేకత.

ఇక అక్కినేని నాగచైతన్య యజమానిగా షోయు( Shoyu ) ఉంది.దీని ప్రత్యేకత ఏమిటంటే.ఖరీదైన పాన్-ఆసియన్ వంటకాలు, సుషీ, థాయ్ కర్రీలు, డిమ్‌సమ్స్ అలాగే ఇది హైదరాబాద్‌లోని మొదటి లగ్జరీ ఆసియన్ రెస్టారెంట్లలో ఒకటి.
ఆసియన్ వంటకాలను ప్రేమించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.ఇక చివరిగా AN రెస్టారెంట్ కి యజమాని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ లు.దీని ప్రత్యేకత ఏమిటంటే.గ్రాండ్ ప్యాలెస్ తరహా డెకార్, హై-ఎండ్ డైనింగ్ అనుభవం.
ఇక ‘వివాహ భోజనంబు’( Vivaha Bhojanambu ) కి యజమాని సందీప్ కిషన్. దీని ప్రత్యేకత ఏమిటంటే.
హై రేటింగ్ కలిగిన సౌత్ ఇండియన్ భోజనం.అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన సినీ కెరీర్‌తో పాటు, భోజన ప్రియులకు స్వల్ప ధరకే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అందించేందుకు ఈ రెస్టారెంట్ ప్రారంభించాడు.
హైదరాబాద్ లోని వీటి ప్రత్యేకతలు తెలుసుకున్నాక, మీకు ఇష్టమైన హీరో రెస్టారెంట్‌ను సందర్శించేందుకు ప్లాన్ చేసుకోండి.మీ అనుభవాన్ని మాతో పంచుకోవడం మర్చిపోవద్దు.







