వేములవాడలో మూడు రోజులపాటు.. మహాశివరాత్రి వేడుకలు పోటెత్తిన భక్తులు..

దక్షిణ కాశీగా పేరు ఉన్న వేములవాడ హరిహర మహాదేవ నామస్మరణంతో మారుమోగుతోంది.శివ మాలధారాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా ఉంది.

 Maha Shivaratri Celebrations In Vemulawada Temple,vemulawada Temple,lord Shiva,-TeluguStop.com

వేములవాడలోని శ్రీ రాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.మహాజాతరకు నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఎక్కడా ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గుడారాలు వేసుకుంటున్నారు.ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు.

గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.రూ 3.70 కోట్లతో జాతర ఏర్పాట్లను పూర్తి చేశారు.రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన లో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Bhakti, Bus, Devotees, Lord Shiva, Maha Shivaratri, Vasaviseva, Vemulawad

మహాశివరాత్రి జాతరకు మూడు లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.స్వామి మహామంటపంలో ఉత్సవ ముహూర్తాలను సిద్ధం చేసి ఉంచాచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు, మున్సిరు.జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు పోలీస్ వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి స్థానిక వాసవి సేవా సమితి పల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణ ప్రసాద్ శుక్రవారం మొదలుపెట్టారు.

Telugu Bhakti, Bus, Devotees, Lord Shiva, Maha Shivaratri, Vasaviseva, Vemulawad

డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు.ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మేటూరి మధు, కొమ్మ నటరాజ్ వెల్లడించారు.దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు.దేవస్థానం తరపున 14 ఉచిత బస్సు సర్వీస్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సేవలను శుక్రవారం రోజు మొదలుపెట్టామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube