తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది.ఇంకా 23 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి.
ఇదే తరుణంలో అన్ని పార్టీలు వారి వారి అభ్యర్థులను ప్రకటించారు.ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్( Congress ), బిజెపి , బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఇలా అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎక్కువగా పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.ఇదే తరుణంలో రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ ఈసారి కాస్త డల్ అయినట్టు కనిపిస్తోంది.
అలాగని కాంగ్రెస్ అంతగా పుంజుకోలేదు.బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పోటీ చేసే శక్తి మాత్రం సంపాదించుకుంది.
అయితే రేవంత్ రెడ్డి( Revanth reddy ) టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ లో వచ్చిన ఊపు, కర్ణాటక ఎన్నికలు మరింత ఊతం ఇవ్వడం, సోనియా , రాహుల్( Rahul gandhi ), ప్రియాంక, మల్లికార్జున కార్గే పర్యటనలు, 6 గ్యారంటీలు ప్రస్తుతం ప్రజలను కాస్త ఆకట్టుకుంటున్నాయి.

ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి తప్పనిసరిగా మేము తెలంగాణలో గద్దెనెక్కుతామని చెప్పారు.కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని అంటున్నారు.రేవంత్ ఏం చూసుకొని అలా మాట్లాడుతున్నారు.
కేసీఆర్( CM kcr ) ను ఓడించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందా.గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్ లో( Kodamgal ) చిత్తుచిత్తుగా ఓడించిన కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా నేనే ఓడిస్తానని రేవంత్ రెడ్డి, కామారెడ్డి లో పోటీ చేయబోతున్నారు.
ఈసారి ఇద్దరు సీఎం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఉండడంతో కామారెడ్డి( Kamareddy ) ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరగబోతున్నాయి.మరి ఇందులో ప్రజల నాడీ ఏ వైపు ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టంగా వారింది.
ఇక కామారెడ్డి రాజకీయం చూస్తే అక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు సరి సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు.ఆ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గంప గోవర్ధన్ పోటీ చేసి 68 వేల ఓట్లతో గెలుపొందారు.
ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ( shabbir ali ) 5000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని చెప్పవచ్చు.ఇక బిజెపి అభ్యర్థి వెంకటరమణ రెడ్డి 15000 ఓట్లు సాధించారు.
ఈసారి కామారెడ్డిలో కేసీఆర్ కూడా పోటీ చేయబోతున్నారు.ఇదే తరుణంలో ఆయనకు పోటీగా రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.
రెండు బలమైన పార్టీలే కాబట్టి అక్కడ బిజెపి ఇతర ప్రాంతీయ పార్టీల ఓటర్లు కీలకంగా ఉన్నారు.

కాబట్టి బిజెపి ఎక్కువగా బీఆర్ఎస్( BRS ) కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, కామారెడ్డిలో బిఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అలాగని కాంగ్రెస్ ను తీసివేయడానికి లేదు.ఇప్పటికే కొంతమంది బీజేపీ లీడర్లు కాంగ్రెస్ లో చేరారు.
నిరుద్యోగులు, మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్ళితే రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.మరి చూడాలి డిసెంబర్ 3న ఎవరి భవితవ్యం ఏమిటో తెలుస్తుంది.







