మెడికో ప్రీతి డెత్ కేసులో వరంగల్ కోర్డు వద్ద హైడ్రామా నెలకొంది.కోర్టు ఎదుట నిందితుడు డాక్టర్ సైఫ్ ను హాజరుపరిచే ముందు వ్యూహాత్మకంగా పోలీసులు వ్యవహరించారని తెలుస్తోంది.
మీడియా కంటపడకుండా కోర్టు వెనుక గేట్ నుంచి సైఫ్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు.మొత్తం మూడు వెహికిల్స్ లో కోర్టుకు చేరుకున్న పోలీసులు… మెయిన్ గేట్ నుంచి రెండు వెహికిల్స్, వెనుక గేటు నుంచి మరో వెహికల్ లో సైఫ్ ను తీసుకెళ్లారు.
విచారణ అనంతరం డాక్టర్ సైఫ్ కు జ్యుడీషియల్ రిమాండ్ కు ఆదేశించారు న్యాయమూర్తి.మరో రెండు రోజులు సైఫ్ ను కస్టడీకి కోరగా…ఈ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేశారు.
అనంతరం పోలీస్ ఎస్కార్ట్ మధ్య డాక్టర్ సైఫ్ ను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం జైలుకు తరలించారు.







