జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న పంచ్ ప్రసాద్ కు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉంది.అయితే ఈ మధ్య కాలంలో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కోలుకుని జబర్దస్త్ లో కనిపించినా మళ్లీ అతనిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని తెలుస్తోంది.
పంచ్ ప్రసాద్ తాజాగా మళ్లీ ఎం.ఆర్.ఐ స్కాన్ చేయించుకున్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రసాద్(Punch prasad) ఈ విషయాలను వెల్లడించారు.
తన యూట్యూబ్ ఛానల్ లో పంచ్ ప్రసాద్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.ఆరు నెలల్లో ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్(kidney transplantation ) జరుగుతుందని ఆయన భార్య తెలిపారు.
ఎం.ఆర్.ఐ స్కాన్ నరకంలా ఉంటుందని పంచ్ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.45 నిమిషాలు అందులో ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుందని పంచ్ ప్రసాద్ వెల్లడించారు.

టెస్టులు చేయించుకునే సమయంలో తాను అరిచానని ఆయన తెలిపారు.చాలామంది ప్రేక్షకుల కోరిక మేరకు ఈ వీడియోను షేర్ చేశామని పంచ్ ప్రసాద్ భార్య పేర్కొన్నారు.పంచ్ ప్రసాద్ కు యూట్యూబ్ ఛానల్ లో అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.పంచ్ ప్రసాద్ కొడుకు, కూతురు వీడియోలో హైలెట్ గా నిలిచారు.వాళ్ల క్యూట్ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకుని సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పంచ్ ప్రసాద్ కష్టాలను దేవుడు తొలగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పంచ్ ప్రసాద్ కు జబర్దస్త్ కమెడియన్లు సైతం ఆర్థికంగా తమ వంతు సాయం చేయించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పంచ్ ప్రసాద్ కు ఆర్థికంగా సహాయం చేస్తానని ఇప్పటికే ఆర్పీ (Kiraak Rp )ప్రకటించిన సంగతి తెలిసిందే.పంచ్ ప్రసాద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
పంచ్ ప్రసాద్ సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







