దేశంలో రోజు రోజుకూ సైబర్ మోసాలు( Cyber fraud ) పెరిగిపోతున్నాయి.అమాయకుల ఫోన్లకు స్పామ్ మెసేజ్‌లను పంపించిన కొందరు కేటుగాళ్లు వారి డబ్బులను కాజేస్తున్నాయి.
బ్యాంకు ఖాతాను కొల్లగొడుతున్నాయి.రోజూ ఇలా మన ఫోన్లకు లెక్కకు మించి స్పామ్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.
ఇలాంటి వాటిని సమర్ధవంతంగా అడ్డుకునేందుకు మెక్‌ఫీ ఇండియా చర్యలు ప్రారంభించింది.మన దేశంలో ఏఐతో కూడిన మెక్ ఫీ స్కామ్ ప్రొటెక్షన్ యాప్( McAfee Scam Protection )ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏఐని ఉపయోగించి టర్బోచార్జ్ స్కామ్‌లను ఇది ఖచ్చితంగా అడ్డుకోనుంది.ఏఐ సాయంతో సైబర్ నేరస్థులు మరింత నమ్మదగిన, వ్యక్తిగతీకరించిన స్కామ్‌లను సృష్టిస్తున్నారు.
ఫిషింగ్ స్కామ్‌లు ప్రతి 11 సెకన్లకు కొత్త ఫిషింగ్ సైట్‌తో ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ముప్పులో మొదటి స్థానంలో ఉన్నాయి.మెక్‌ఫీ స్కామ్ ప్రొటెక్షన్ మీ కోసం స్కామ్‌ను ముందస్తుగా గుర్తించి బ్లాక్ చేస్తుంది.
డెలివరీ మెసేజ్, బ్యాంక్ నోటిఫికేషన్ టెక్స్ట్ నిజమైనదా కాదా అని ఆశ్చర్యపోనవసరం లేదు.

మెకాఫీ పేటెంట్ పొందిన ఏఐ సాంకేతికత మీకు వార్నింగ్ మెసేజ్ పంపడం ద్వారా క్లిక్ చేసే ముందు మిమ్మల్ని ఆపుతుంది.హానికరమైన లింక్‌లను తక్షణమే గుర్తిస్తుంది.ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ హానికరమైన లింక్‌పై క్లిక్ చేసినప్పటికీ, మెక్‌ఫీ స్కామ్ ప్రొటెక్షన్ ముందుగానే సైట్‌ను లోడ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది.

సైబర్ నేరస్థులు దాడి ఖచ్చితత్వం, అధునాతనత, వేగాన్ని మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు.ఇది నకిలీ నుండి నిజమని చెప్పడం గతంలో కంటే కష్టతరం చేస్తుంది.అందుకే వాటి నుంచి మనం లక్ష్యంగా చేసుకున్నామని తెలియకముందే, మనల్ని రక్షించుకోవడానికి వినూత్నమైన ఏఐ అవసరం’ అని మెకాఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రెగ్ జాన్సన్ అన్నారు.మెక్ ఫీ స్కామ్ ప్రొటెక్షన్ ఫేక్ ఇమెయిల్‌లు, టెక్స్ట్‌లు, సోషల్ మీడియా( Social media ) లింక్‌లను చురుగ్గా గుర్తించి బ్లాక్ చేయడానికి సాయపడుతుంది.