బాలయ్యని ఓ రేంజ్లో వాడేస్తున్న ఆహా..!

నందమూరి బాలకృష్ణ ఆహా లో అన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ షో ద్వారా ప్రేక్షకులకు తనలోని మరో యాంగిల్ చూపిస్తున్నారు బాలయ్య బాబు.

 Aha Using Balakrishna For Promoting Movies, Aha , Balakrishna , Ott Show , Tolly-TeluguStop.com

టాలీవుడ్ సెలబ్రిటీస్ తో సరదా సరదాగా సాగుతున్న ఈ షో తో బాలయ్య బాబు నిజంగానే ఆహా అనిపిస్తున్నాడు.కేవలం అన్ స్టాపబుల్ మాత్రమే కాదు ఆహా కోసం బాలయ్య ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.

ఆహాలో కొత్తగా సినిమా పురం అదే ఆహా పురం తెలుగు వారికి కొత్త అలవాటు అంటూ ప్రతి శుక్రవారం ఆహాలో ఓ కొత్త సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

దీన్ని ప్రమోట్ చేస్తూ బాలకృష్ణ కూడా ఆహాలో ప్రతి శుక్రవారం ఓ సినిమా రిలీజ్ తెలుగు వారికి కొత్త అలవాటు అని చెప్పించారు.

కేవలం అన్ స్టాపబుల్ షోనే కాదు ఆహా కోసం బాలకృష్ణని ఇలా ప్రమోషన్స్ కి కూడా వాడేస్తున్నారు ఆహా టీం.ఏది ఏమైనా అల్లు అరవింద్ మెగా బుర్రకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.అన్ స్టాపబుల్ సూపర్ హిట్ కాగా త్వరలో ఈ సీజన్ ముగిస్తున్నారు.మళ్లీ సెకండ్ సీజన్ లో ఈసారి చిరంజీవి, నాగార్జునలతో పాటుగా మరికొంతమంది స్టార్స్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube