మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు దక్కించుకున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం మల్టీస్టారర్ చిత్రం అవ్వడంతో సితార వారు హీరోలను ఎంపిక చేయడంలో ఫెయిల్ అయ్యారు.
సినిమాకు రెడీ చేయించిన స్క్రిప్ట్‌కు ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు.దాంతో సినిమా రీమేక్‌కు పక్కకు పెట్టేశారు.
ఇలాంటి సమయంలో దిల్ రాజు ఆ రీమేక్ రైట్స్ బాధ్యతలను దక్కించుకున్నాడట.
మలయాళ నిర్మాత నుండి దాదాపుగా కోటి రూపాయలకు గాను సితార వారు రైట్స్‌ను దక్కించుకున్నారు.
ఇప్పుడు అదే మొత్తంకు దిల్‌రాజు వారి నుండి రైట్స్‌ను కొనుగోలు చేశాడట.ఈ మొత్తం వ్యవహారం చకచక జరిగి పోయింది.దిల్‌రాజు చేతిలోకి ఆ రీమేక్ రావడంతో ప్రముఖ దర్శకుడు రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి.
త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

దిల్‌రాజు చేతికి ఈ రీమేక్ రావడంతో పెద్ద హీరోలు సైతం ఇందులో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట.దిల్‌రాజు ఇలాంటి ప్రాజెక్ట్‌లను బాగా డీల్ చేస్తాడనే టాక్ ఉంది.మల్టీస్టారర్ చిత్రాలు ఆయన బాగా నిర్మిస్తాడు.
మంచి దర్శకుడిని మరియు బడ్జెట్ ను పెడతాడు.అందుకే తప్పకుండా ఈ సినిమాలో నటిస్తానంటూ ఒక సీనియర్ హీరో ఇప్పటికే హామీ ఇచ్చాడట.
ఇన్ని రోజులు ఈ సినిమా రీమేక్ గురించే ప్రచారం జరిగింది.ఇకపై పనులు మొదలు కానున్నాయి అది కూడా దిల్ రాజు వల్ల అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.