వైరల్: కిడ్నాపర్లతో తల్లి వీరోచిత పోరాటం...!

ఇంటి ముందు నుండి తన నాలుగేళ్ల అమ్మాయి ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు ఇద్దరు కిడ్నాపర్స్.ఆ సమయంలో ఓ తల్లి తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఈ సంఘటన సంబంధించి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

 Woman Fights Off Kidnappers In Delhi's Shakurpur,kidnappers, Social Media, Cc Ca-TeluguStop.com

ఆ తర్వాత ఆ సంఘటనకు సంబంధించి బతుకు జీవుడా అని పారిపోతున్న ఇద్దరి కిడ్నాపర్లను పట్టుకునేందుకు మరో యువకుడు అత్యంత సమయస్పూర్తి తో వ్యవహరించిన ఈ సంఘటన కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఢిల్లీ నగరంలోని షకార్‌ పూర్ లో ఓ ఇంట్లో కి చోరపడిన కిడ్నాపర్ తల్లి కళ్ళముందే తన కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు కిడ్నాపర్స్.ఇందులో ఓ కిడ్నాపర్ చిన్నారిని ఎత్తుక వెళ్లగా అదే సమయానికి మరో కిడ్నాపర్ బైక్ స్టార్ట్ చేసి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈ సంఘటనలో తల్లి అప్రమత్తంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా గేటు లో నుంచి బయటకు వచ్చి కిడ్నాపర్ల నుంచి తన అమ్మాయిని కాపాడుకుంది.

అదే సమయంలో గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరి కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు సమయస్ఫూర్తితో కిడ్నాపర్ బైక్ ఆపేందుకు మరో బైకును రోడ్డుకు అడ్డంగా ఉంచి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ సంఘటన నడుమ ఇద్దరి కిడ్నాపర్లు వారి బైకు అక్కడే వదిలేసి ఉడాయించారు.ఆ తర్వాత బైక్ నెంబర్ ఆధారంగా ఇద్దరు కిడ్నాపర్ల ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube