పుష్ప ది రూల్ సినిమా( Pushpa ) నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ప్రోమో కేవలం 20 సెకన్ల నిడివితో ఉండగా ప్రోమో ఫ్యాన్స్ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి.
దేవిశ్రీ ప్రసాద్( Devishri Prasad ) పుష్ప ది రైజ్ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ ప్రోమో మెప్పించడం కష్టమేనని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ సినిమా ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.అయితే బన్నీ( Bunny) అభిమానులు పుష్ప ది రూల్ మూవీకి భారీ మొత్తం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో పాటలు కూడా మరీ భారీగానే ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతారు.
పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ విడుదలైతే ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
పుష్ప ది రూల్ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ సినిమా కోసం అటు బన్నీ ఇటు సుకుమార్ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.అల్లు అర్జున్ ( Allu Arjun )క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటంతో పుష్ప ది రూల్ తో మరో సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పోల్చి చూస్తే పుష్ప ది రూల్ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.పుష్ప ది రూల్ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ సినిమా విషయంలో బన్నీ పెట్టుకున్న ఆశలు నిజమవుతాయో లేదో చూడాలి.