మీ పిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారా..? అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈమధ్య కాలంలో స్మార్ట్ ఫోన్( Smartphone ) వాడకం చాలా ఎక్కువగా నడుస్తుంది.అయితే పెద్ద వాళ్ల దగ్గర నుండి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.

 Side Effects Of Using Mobile While Eating,mobile,eating,mobile Watching,telugu H-TeluguStop.com

ప్రస్తుతం పిల్లలు ఫోన్ చూస్తూనే అన్నం తింటున్నారు.పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఏడిస్తే ఫోన్ చూపిస్తున్నారు.

ఈ విధంగా పిల్లలు ఫోన్ కు అలవాటు పడిపోతున్నారు.అయితే రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90 శాతం మంది సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారని అధ్యయనాల్లో తేలింది.

అయితే పిల్లలు కడుపునిండా అన్నం తింటున్నారని అనుకుంటాం.

Telugu Effect Brain, Tips, Spectacles, Telugu-Telugu Health

కానీ దీనివలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) వస్తాయని మాత్రం ఎవ్వరూ గమనించలేక పోతారు.దీని వలన వారిపై మానసికంగా, శారీరకంగా కూడా చెడు ప్రభావం పడుతుంది.అయితే పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తే అది మెదడుపై ప్రభావం( Effect on Brain ) చూపిస్తుంది.

సెల్ఫోన్ చూసే ప్రతి పిల్లలు నలుగురిలో కంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.ఎవరితో సరిగా మాట్లాడరు.ఇది దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది.అయితే పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వలన వాళ్ళు ఏది తింటున్నారు అన్నదాని గురించి కూడా గమనించరు.

దీంతో వాళ్లకు తినే ఆహారం రుచి కూడా తెలియకుండా పోతుంది.

Telugu Effect Brain, Tips, Spectacles, Telugu-Telugu Health

అలాగే తిండి ఎలా ఉందో అన్నదాని గురించి కూడా అర్థం కాదు.ఇక కొంతమంది ఫోన్ చూస్తూ ఎక్కువగా అన్నం తినేస్తూ ఉంటారు.మరికొందరు తక్కువగా తింటారు.

దీంతో వాళ్ళు ఎంత తింటున్నారు అన్నది కూడా అర్థం కాదు.ఇక పిల్లలు ఈ విధంగా ఫోన్ యూజ్ చేస్తే బలహీనంగా మారిపోతారు.

దీని వలన చిన్న వయసులోనే కళ్ళజోడు( Spectacles ) ధరించాల్సి వస్తుంది.అంతేకాకుండా చిన్నప్పటినుంచి స్క్రీన్ దగ్గర నుండి చూడడం వలన రెటీనా కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.

అంతేకాకుండా పిల్లలు ఇలా ఫోన్ చూస్తూ అన్నం తినడం వలన తల్లి, బిడ్డల సంబంధం పై కూడా చెడు ప్రభావం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube