నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.మంగళవారం ఎస్పీ అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ఇసుక రీచ్ లను పరిశీలించారు.
ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.ప్రతి వాహనాల వివరాలు సేకరించి నోట్ చేసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.అక్రమంగా ఇసుక తరలించిన వారికి సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.







