అప్పుడు అనాథ ఇప్పుడు స్పూర్తిదాత.. లక్ష రూపాయల సహాయంతో అనాథలకు అండగా నిలుస్తూ?

బాల్యంలోనే తల్లీదండ్రులు చనిపోతే ఆ పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీకావు.అలా చిన్నతనంలోనే తల్లీదండ్రులను కోల్పోయిన రుద్ర రచన మంత్రి కేటీఆర్ సహాయంతో ఉన్నత విద్య చదివారు.

 Orphan Girl Rudra Rachana Kind Heart Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

కేటీఆర్ అండతో బీటెక్ పూర్తి చేసిన రుద్ర రచన తన టాలెంట్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించారు.అయితే ఉద్యోగం సాధించడంలో వింతేం లేకపోయినా తన సంపాదనలో లక్ష రూపాయలను సహాయం చేయడం ద్వారా రుద్ర రచన వార్తల్లో నిలిచారు.

తనలాంటి అనాథలను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో రుద్ర రచన ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు.రుద్ర రచన( Rudra rachana ) మంచి మనస్సుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.అప్పుడు అనాథ అయిన రుద్ర రచన ఇప్పుడు స్పూర్తిదాతగా నిలిచారు.రుద్ర రచన స్వస్థలం జగిత్యాల జిల్లా( Jagtial district ) కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామం కాగా రుద్ర రచన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్లు చేశారు.

తల్లీదండ్రులు లేని నాకు కేటీఆర్( KTR ) అండగా నిలిచారని బీటెక్ చదివిన నాకు కొన్ని నెలల క్రితం ఉద్యోగం వచ్చిందని ఆమె అన్నారు.మంత్రి కేటీఆర్ నాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరవలేనని నా వేతనంలో లక్ష రూపాయలను సీఎం సహాయనిధికి అందించానని ఆమె అన్నారు.రుద్ర రచన చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేయడం గమనార్హం.రుద్ర రచన ట్వీట్ చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోయిందని కేటీఆర్ అన్నారు.

రుద్ర రచన ఎంతో గొప్ప పని చేసిందని తన ట్వీట్ చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోయిందని కేటీఆర్ వెల్లడించారు.రుద్ర రచన కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకుని ఎంతోమందికి తన వంతు సహాయం చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube