టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా, అలాగే శర్వానంద్ కి జోడీగా ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది.వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్లు లైన్ లో ఉన్నాయి.ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న రష్మిక అప్పుడప్పుడు తనకి ఇష్టమైన పనులు చేస్తుంది.అలాగే స్నేహితుల కోసం కొత్త అవతారాలు ఎత్తుతుంది.ఇప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కోసం వెబ్ పోర్టల్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనుంది.
ఉపాసన అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతో యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ను కూడా నడుపుతుంది.ఇందులో మహిళలకి సంబందించిన అనేక చిట్కాలు పంచుకుంటుంది.
దీనికి ఆ మధ్యకాలంలో గెస్ట్ ఎడిటర్ గా సమంత చేసింది.
పలు హెల్త్ టిప్స్ ను, ఆరోగ్యాన్నిచ్చే రెసిపీ తయారీ విధానాన్ని తెలియజేసింది.
ఈ క్రమంలో ఉపాసన కోరికపై ఈసారి ఈ వెబ్ పోర్టల్ కి కథానాయిక రష్మిక గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనుంది. ఫిట్ నెస్ విషయంలో రష్మిక చాలా శ్రద్ధ తీసుకుంటుంది.
అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తోంది.సమంత ఎడిటర్ గా హెల్త్ టిప్స్ చాలా అందించింది.

మరి రష్మిక ఎడిటర్ గా ఎటువంటి హెల్త్ టిప్స్ ని వెబ్ పోర్టల్ ద్వారా అందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా అందాల భామలు కేవలం సినిమాలు అనే కాకుండా ఇలాంటి సోషల్ అవేర్ నెస్ యాక్టివిటీస్ లో భాగం కావడం నిజంగా గొప్ప విషయం.ఈ గెస్ట్ ఎడిటర్ గా చేస్తున్న రష్మిక ఆరెంజ్ కలర్ డ్రెస్ తో ఫోటోలకి ఫోజులు ఇచ్చి సందడి చేసింది.