ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.

 Family Members Meeting With Chandrababu Today..!-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్ తోపాటు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలవనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీ నుంచి గన్నవరంకు చేరుకున్న లోకేశ్ రోడ్డు మార్గంలో రాజమండ్రికి బయలుదేరారు.మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చంద్రబాబు కోసం వీఐపీ వార్డును సిద్ధం చేశారని తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube