ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
మనం ఆశించిన ప్రగతి దేశంలో రావడం లేదన్న కేసీఆర్ అభ్యర్థి గుణగణాలు, పార్టీల ఆలోచన సరళి గురించి ఆలోచించాలన్నారు.ప్రజలను గెలిపించే వాళ్లను ఎన్నికల్లో గెలిపిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం గెలిచినట్లని చెప్పారు.
ఈ క్రమంలోనే ఏది నిజమో ఏది అబద్ధమో ఆలోచించి ఓటేయాలని సూచించారు.సమైక్య పాలనలో పాలమూరును ఏ గతి పట్టించారో మీకు తెలుసన్న కేసీఆర్ పాలమూరు ప్రజలు వలసలు వెళ్లి చాలా బాధపడ్డారని తెలిపారు.
గతంలో మన గోస ఎవరన్నా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.కృష్ణా, తుంగభద్ర పారే జిల్లాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ కాదా అని నిలదీశారు.
తాను ఆమరణ దీక్ష చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదన్నారు.గతంలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడెలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఆగమాగం కాకుండా ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు.