మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.
ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.
కొరటాల ఫస్ట్ సినిమా మిర్చి.
ఈ సినిమాతోనే కొరటాల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్ లుగా నటించారు.ఇద్దరు కూడా జోడీ పరంగా అదుర్స్ అనిపించారు.అంతేకాదు కొరటాల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.అందుకే అలంటి కాంబో మరోసారి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
2013లో ఈ కాంబోలో మిర్చి సినిమా రావడమే కాకుండా ఇద్దరికీ కూడా వారి కెరీర్ లో బెస్ట్ సినిమాగా మిగిలి పోయింది.అయితే ఇటీవలే మెగా హీరోలతో చేసిన సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాసు అని అంతా అనుకున్నారు.కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం విదితమే.మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇది ఇలా ఉండగా మరోసారి
మిర్చి కాంబో రిపీట్
కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి.ఇటీవలే ప్రభాస్ ను కొరటాల కలిసి కథ చెప్పగా ఆయన పాజిటివ్ గా స్పందించినట్టు టాక్.
అంతేకాదు వీరి కాంబో లో సినిమాను యువీ క్రియేషన్స్ లో చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట.ఇదే కనుక నిజం అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి.