మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది... వైరల్ అవుతున్న నమ్రత పోస్ట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక మహేష్ బాబు భార్య సినీనటి నమ్రత ( Namrata ) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.

 Mahesh Babu's Wife Namrata Shirodkar Shares School Girls Photo With Bicycles In-TeluguStop.com

బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె పలు వ్యాపారాలతో పాటు కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన తన పిల్లలకు సంబంధించిన విషయాలను అందరితో షేర్ చేసుకుంటారు.

ఇకపోతే ఈనెల 20 తేదీ సితార ( Sitara ) తన 11వ పుట్టినరోజు(Birthday) వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబు ఫౌండేషన్ ( Mahesh Babu Foundation ) ఆధ్వర్యంలో ఉన్న పిల్లల సమక్షంలో సితార తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఇలా పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలకు సైకిళ్ళను ( Bicycles ) కానుకగా ఇచ్చారు.

అయితే ఆ చిన్నారులందరు కూడా సైకిళ్లపై పాఠశాలలకు వెళ్లారు.ఇలా అమ్మాయిలందరూ సైకిళ్లతో పాటు పాఠశాల ముందు నిలబడి ఉన్నటువంటి ఫోటోని తాజాగా నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో షేర్ చేసిన నమ్రత.ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడానికి చాలా ఇష్టపడుతున్నారు.ఇలా వీరంతా పాఠశాలకు సైకిల్ పై వెళ్లడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.మన చదువులు ఆనందంగా కొనసాగడానికి ఇలాంటివి చాలా అవసరం మీ కళ్ళల్లో ఆనందం తీసుకువచ్చిన సితార మహేష్ బాబు ఫౌండేషన్ కి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా నమ్రత చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సితార పుట్టినరోజు( Sitara Birthday ) సందర్భంగా ఈ 40 మంది విద్యార్థులకు సైకిళ్లను కానుకగా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube