ఐపీఎల్. ఈ పేరు వింటే ఐపీఎల్ అభిమానుల్లో తెలియని ఉత్కంఠ, ఉత్సాహం.
ఐపీఎల్ కోసం ఎందరో అభిమానులు కళ్లు కాయాలు కాచేలా వేచి చూస్తుంటారు.ఈ ఏడాది మార్చి 26 నుంచి 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
అయితే ఈ సీజన్లో ఐపీఎల్ కు సంబంధించి కొత్త నిబంధనలను బీసీసీఐ తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.ముఖ్యంగా డీఆర్ఎస్, సూపర్ ఓవర్, టీం కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఉంటే ఏం చేయాలో అనే విషయాలపై బీసీసీఐ కీలక నిబంధనలను రచించినట్లు సమాచారం.
డీఆర్ఎస్ (DRS)
అంపైర్ల పోరపాటు నిర్ణయాలకు ఇది ఉపయోగపడుతుంది.అంపైర్ నిర్ణయం తప్పు అని తెలిస్తే వ్యతిరేకంగా వచ్చిన ప్లేయర్ కానీ.
టీం కెప్టెన్ కానీ ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది.దీంతో కచ్చితమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
గత సీజన్లో ప్రతి టీం కూడా ఒకసారి మాత్రమే డీఆర్ఎస్ ఉపయోగించే అవకాశం ఉండేది.ఒకవేళ తప్పు అని తేలితే.
ఆ టీం డీఆర్ఎస్ ను కోల్పేయే అవకాశం ఉంటుంది.తాజాగా బీసీసీఐ నిర్ణయంతో ఇకపై ప్రతి టీం ఇన్నింగ్స్ కు రెండు సార్లు డీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది.
సూపర్ ఓవర్ గురుంచి తెలుసుకుందాం.
గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్-4 లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.అయితే తాజా ఫ్లే ఆఫ్ విషయంలో బీసీసీఐ కొత్త నిబంధనలను తీసుకురానుంది.ప్రస్తుతం టీం ’ఏ‘, టీం ’బీ‘ మధ్య ఓ ఫ్లే ఆప్ మ్యాచ్ జరిగిందనుకోండి.
ఆ మ్యాచ్ చివరకు టైగా ముగిసింది.విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరం పడుతుంది.
సూపర్ ఓ వర్షంతో సాధ్యపడలేదు అని అనుకుంటే అప్పుడు గ్రూప్ దశ లో రెండు జట్లు మధ్య ఏ జట్టు అత్యధిక పాయింట్లు సాధించాయో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు.మరో రూల్ ఏమిటంటే మ్యాచ్ కు ముందు జట్టులోని ప్లేయర్ కరోనా భారీన పడితే ఆ మ్యాచ్ జరగకపోతే ఆ మ్యాచ్ రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది.
ఒక వేళ మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే కరోనా వల్ల మ్యాచ్ అడకపోయిన టీంను లూజర్స్ గా ప్రకటించి, ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తారు.