సినిమాల్లో ముట్టుకోవడాలు, పట్టుకోవడాలు కామన్.కానీ ఒక్కోసారి ఎందుకలు అలా పట్టుకుంటున్నారు అని కుటుంబ సభ్యులు అడిగితే.
చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
క్యారెక్టర్ ఆర్టిస్టు వై.విజయకు.ఇంతకీ ఆమెను అలా అడిగింది ఎవరో తెలుసా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ నడుస్తుంది.
అప్పటికే తన క్యారెక్టర్ కు సంబంధించి రెండు మూడు రోజులు గా షూటింగ్ లో పాల్గొంటుంది వై విజయ.ఒక రోజు సినిమా షూటింగ్ స్పాట్ కు విజయ తన కూతురు అనును తీసుకెళ్లింది.
అక్కడ ఒకచోట కూర్చుని షూటింగ్ చూసుంది అను.కొద్ది సేపటి తర్వాత దర్శకుడు బ్రేక్ చెప్పాడు.అదే సమయంలో అను దగ్గరకు వచ్చింది విజయ.చిరంజీవి కూడా అక్కడికి వచ్చాడు.అనును చూసి విజయతో అబ్బా.అచ్చం మీ నోట్లో నుంచి ఊడిపడినట్లుగానే ఉందండి మీ అమ్మాయి అన్నారు.
విజయ భుజం తట్టి ఈ మాట చెప్పారు.అక్కడిని నుంచి చిరంజీవి వెళ్లిపోయాక.
మమ్మి నిన్ను అందరూ పట్టుకుంటున్నారు ఏంటి? అని అడిగింది అను.దీంతో విజయకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.ఇష్టంగా మాట్లాడినప్పుడు అలాగే చేస్తారని చెప్పి కవర్ చేసింది విజయ.
అటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయశాంతి, రమ్యక్రిష్ణ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయి అంటారు విజయ.
ముఖ్యంగా విజయశాంతి చెప్పడం వల్లే తాను ఓ కల్యాణ మండపంతో పాటు కమర్శిషల్ కాంప్లెక్స్ కట్టుకున్నట్లు చెప్పింది.వాటి నుంచి వస్తున్న ఆదాయం భవిష్యత్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
సినిమా షూటింగ్ జరిగే సమయంలో తనతో విజయశాంతి ఎంతో స్నేహంగా మెలిగే వారని చెప్పారు.పలు విషయాల గురించి చర్చించే వారిని చెప్పారు.
అలా మాట్లాల్లో భాగంగానే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పారని విజయ వెల్లడించారు.రమ్యక్రిష్ణ కూడా మంచి సలహాలు ఇచ్చే వారని చెప్పారు.
ఇద్దరి మూలంగానే ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు విజయ.