నిజ జీవితంలో రష్మీ సుధీర్ జోడీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు కానీ ఈ జోడీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది.బుల్లితెరపై ఈ మధ్య కాలంలో పాపులరిటీని అంతకంతకూ పెంచుకుంటున్న సుడిగాలి సుధీర్ పుట్టినరోజు నేడు.
మోస్ట్ ఎలిబిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ టాలెంట్ తో వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.ఈటీవీకే పరిమితమైనప్పటికీ ఆ ఛానెల్ లో ప్రసారమయ్యే షోలు, ఈవెంట్లలో సుధీర్ ఎక్కువగా కనిపిస్తున్నారు.
మ్యాజిక్ షోలతో కెరీర్ ను ప్రారంభించిన సుడిగాలి సుధీర్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అయితే జబర్దస్త్ షోలో అవకాశం వచ్చిన తరువాత టీమ్ లీడర్ గా ఎదిగిన సుధీర్ తన స్కిట్లు హిట్ కావడంతో పాటు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి.
రష్మీ గౌతమ్ వల్ల సుడిగాలి సుధీర్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.రష్మీ సుధీర్ మధ్య కెమిస్ట్రీ వల్లే చాలా షోలు హిట్ అయ్యాయి.
మరోవైపు రష్మీనే సుధీర్ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది.రష్మీ, సుధీర్ వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉండగా వీళ్లిద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రష్మీ సైతం మంచి కథ దొరికితే సుధీర్ తో కలిసి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.ప్రస్తుతం సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమాలో నటిస్తుండటం గమనార్హం.
మరోవైపు తాజాగా ఒక సందర్భంలో సుధీర్ తన పెళ్లికి సంబంధించి స్పష్టతనిచ్చారని సమాచారం.మరో రెండు సంవత్సరాల పాటు పెళ్లికి దూరంగా ఉండాలని సుధీర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రష్మీతో ప్రస్తుతానికైతే పెళ్లి లేనట్టేనని సుధీర్ స్పష్టతనివ్వడం గమనార్హం.కాలింగ్ సహస్ర మూవీతో సుడిగాలి సుధీర్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.