విట‌మిన్ సి లోపం వ‌ల్ల ఇన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయా.. అస‌లు దాన్ని గుర్తించ‌డం ఎలా?

మన శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ సి( Vitamin C ) ఒకటి.ఈ విషయం అందరికీ తెలుసు.

 Problems Caused By Vitamin C Deficiency, Vitamin C Deficiency, Vitamin C, L-TeluguStop.com

కానీ విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది.ఎముకలు, రక్తనాళాలు, చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ సి అవసరం ఎంతో ఉంది.

అలాగే మన శరీరంలో జరిగే మరిన్ని పనులకు విటమిన్ సి అవసరం అవుతుంది.అందుకే నిత్యం విటమిన్ సి ని ఆహారం ద్వారా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

Telugu Problems, Tips, Latest, Vitamin-Telugu Health

పొరపాటున విటమిన్ సి లోపం ఏర్పడితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.మన బాడీ ఐరన్ ను గ్రహించాలి అంటే విటమిన్ సి కావాలి.ఎప్పుడైతే విటమిన్ సి లోపిస్తుందో మన బాడీ ఐరన్ ను అబ్సర్వ్ చేసుకోలేక పోతుంది.దాంతో రక్తహీనత స‌మ‌స్య‌( Anemia problem ) ఏర్పడుతుంది.అలాగే విటమిన్ సి లోపం వల్ల కీళ్ల నొప్పులు( Joint pains ) ఇబ్బంది పెడతాయి. నీరసం, అలసట, విపరీతంగా వేధిస్తాయి.

Telugu Problems, Tips, Latest, Vitamin-Telugu Health

చర్మం పాలిపోవడం, శరీరం బలహీనంగా మారడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ళ వాపు.ఇవన్నీ విటమిన్ సి లోపం వచ్చే సమస్యలే.అలాగే శరీరంలో విటమిన్ సి లేకపోతే గాయాలు కూడా త్వరగా మానవు. చర్మం పొడిగా, కాంతిహీనంగా మారిపోతుంది.గుండె ఆరోగ్యం( Heart health ) దెబ్బతింటుంది.రక్తపోటు స్థాయిలు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

అందుకే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిను అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్, లెమన్, టమాటో, పైనాపిల్, బొప్పాయి బ్రోకలీ, కివి, స్ట్రాబెర్రీ, క్యాప్సికం, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, జామ, గ్రేప్స్ వంటి ఆహారాల్లో విటమిన్ సి మెండుగా నిండి ఉంటుంది.

కాబట్టి ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.తద్వారా విటమిన్ సి లోపం ఏర్పడకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube