భారతీయ ఐటీ నిపుణులే టార్గెట్ గా అమెరికా వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ విధానంపై మరొక కొత్త ఆంక్షని పెట్టింది.గతంలోనే ఎన్నో రకాలుగా భారత్ నుంచీ ఉద్యోగాలకి ఎవరూ రాకుండా భారతీయ ఎన్నారైలు టార్గెట్ గా చేస్తూ ట్రంప్ వీసాలపై పెట్టిన నిభందనలు అందరికీ తెలిసిందే అయితే తాజాగా ప్రవేశపెట్టిన నిభంధనలు ఐటీ నిపుణులకి షాక్ ఇచ్చాయి.
వివరాలలోకి వెళ్తే.
హెచ్1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై అమెరికా విధించిన తాత్కాలిక రద్దును మరో ఐదు నెలల పాటు పొడిగించింది…ఈ గడువు సెప్టెంబరు 10తో ముగిస్తుండగా దీన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 వరకూ పొడిగిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యూఎస్ఐసీఎస్) ప్రకటించింది…ఇంతకీ ఏమిటి ఈ ప్రీమియం ప్రాసెసింగ్ అంటే.వీసా దరఖాస్తులను వేగంగా పరిశీలించే వెసులుబాటు.
మాములుగా వీసా క్లియరెన్స్ అవ్వడానికి సుమారు ఆరు నెలల దాకా సమయం పడుతుంది.అయితే ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయవచ్చు.అంటే కంపెనీలు టెకీలను ఎంపిక చేసుకున్నాక- క్యూలో ఉండి వీసా పొందాల్సిన అవసరం లేకుండా వేగంగా దీనిని సంపాదించుకు కుంటున్నారు.
అయితే ఇప్పుడు ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం.కంపెనీలు క్యూలో ఉండి, తమకు కేటాయించిన సమయం ప్రకారం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.అంతేకాదు ఇందుకు గాను అదనంగా మరొక 1225 డాలర్లు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది.