చాలామంది ఉదయం పూట అల్పాహారంలో బ్రెడ్ అలాగే తేనెను తీసుకుంటూ ఉంటారు.అయితే దీనిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలామంది అది సహజ సిద్ధమైన తేనె కాదని భావిస్తూ ఉంటారు.అయితే తేనెలో కూడా తెలుపు రంగు తేనె ఉంటుంది.
అయితే తెలుపు రంగులో ఉన్న తేనెను వాడడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ విధంగా తెల్ల తేనెను ముడి తేనే అని కూడా అంటారు.
ఇక ఈ ముడి తేనె( White honey ) వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, ఈ తెల్ల తేనెను తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులకు మనం దూరంగా ఉండొచ్చు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెల్ల రంగులో ఉండే తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లాంటి ఎన్నో విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.
ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటారు.ఎందుకంటే ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఈ విధమైన తెల్ల తేనెను ఉపయోగిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్(Heart disease ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ప్రస్తుత వాతావరణం లో మార్పుల వల్ల చాలామందికి దగ్గు సమస్య వస్తుంది.ఇలాంటివారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను ఇంకా నిమ్మ రసాన్ని కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగడం వలన నోటిలో ఏర్పడే నోటి పుండ్లు( Mouth ulcer ) ఇంకా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
ఇక ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వలన హిమోగ్లోబిన్( Hemoglobin ) స్థాయిలు కూడా ఈజీగా పెరుగుతాయి.అంతేకాకుండా రక్తహీనత సమస్య( Anemia ) కూడా దూరం అవుతుంది.అందుకే తెల్ల తేనె వల్ల మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చు.కాబట్టి తెల్ల తేనె వాడండి, ఆరోగ్యమైన జీవితాన్ని గడపండి.