సీనియర్ నటుడు చంద్రమోహన్( Chandramohan ) మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.గుండె సంబంధిత సమస్యల( Heart related problems ) వల్లే చంద్రమోహన్ మృతి చెందారని సమాచారం అందుతోంది.82 సంవత్సరాల వయస్సులో చంద్రమోహన్ తుదిశ్వాస విడవడం ఆయన అభిమానులకు కంటతడి పెట్టిస్తోంది.సోమవారం రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనుండగా హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.
చంద్రమోహన్ మృతిపై టాలీవుడ్( Tollywood ) సినీ ప్రముఖులు స్పందించి సంతాపం వ్యక్తం చేశారు.అయితే చంద్రమోహన్ కు మాత్రమే సొంతమైన ఒక రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, తండ్రి పాత్రల్లో, కమెడియన్ రోల్స్ లో ఇలా ఏ పాత్రలో అయినా జీవించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటులలో చంద్రమోహన్ ఒకరు.
50 సంవత్సరాల పాటు నటుడిగా కెరీర్ ను కొనసాగించిన అతికొద్ది మందిలో చంద్రమోహన్ ఒకరు కావడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి సినిమాలు చేసిన చంద్రమోహన్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ లతో కూడా కలిసి నటించడం గమనార్హం.ఈ తరం హీరోలైన మహేష్, ఎన్టీఆర్, బన్నీ, కళ్యాణ్ రామ్, గోపీచంద్, మనోజ్, విష్ణు సినిమాలలో చంద్రమోహన్ నటించారు.
చంద్రమోహన్ నటుడిగా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ను అందుకున్నారు.చంద్రమోహన్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెప్పవచ్చు.మూడు తరాల హీరోలతో కలిసి నటించి చంద్రమోహన్ రేర్ రికార్డ్ ను అందుకున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో చంద్రమోహన్ ముందువరసలో ఉంటారు.చంద్రమోహన్ తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.చంద్రమోహన్ టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
నాన్న పాత్రలలో ఎక్కువగా నటించిన ఆయన ఆ పాత్రలకు ప్రాణం పోశారు.