ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్( CM Jagan ) ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని( Election Campaign ) మొదలుపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇచ్చాపురం లేదా నర్సీపట్నం నుంచి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారని తెలుస్తోంది.2019 ఎన్నికల్లోనూ నర్సీపట్నం నుంచే సీఎం జగన్ ప్రచారాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ తరహాలోనే ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టనున్న సీఎం జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది.ఇందులో భాగంగా బహిరంగ సభలతో( Public Meetings ) పాటు రోడ్ షోలు( Road Shows ) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించారు.కాగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఈ నెల 16న సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
వైఎస్ఆర్ ఘాట్ లో దివంగత నేత వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించనున్నారు.







