Santosh Vasunia : అమ్మ రోజుకూలీ.. ఐడియాతో లక్షల్లో సంపాదిస్తున్న యువతి.. వసునియా సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే విషయం నమ్మినా నమ్మకపోయినా నిజమేనని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝబువా ప్రాంతానికి చెందిన సంతోష్ వసునియా( Santosh Vasunia ) పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

 Santosh Vasuniya Inspirational Success Story Details Here Goes Viral In Social-TeluguStop.com

కరోనా సమయంలో సంతోష్ వసునియా కుటుంబానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.అయితే ఆ సమయంలో సొంతంగా బిజినెస్ ను మొదలుపెట్టిన వసునియా బిజినెస్ లో సక్సెస్ అయ్యారు.

కేవలం లక్ష రూపాయలతో బిజినెస్ మొదలుపెట్టిన వసునియా సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంతో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించారు.ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం( Prime Minister’s Employment Programme ) ద్వారా ద్వారా 3.75 లక్షల రూపాయల సహాయం పొందిన వసునియా ఆ మొత్తం బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టి సక్సెస్ అయ్యారు.గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న వసునియా కాస్మెటిక్ బిజినెస్ లో సత్తా చాటుతున్నారు.

Telugu Primeministers-Inspirational Storys

నాలుగు సంవత్సరాల వయస్సులోనే నాన్న చనిపోయారని వసునియా చెప్పుకొచ్చారు.నేను పదో తరగతి మాత్రమే చదువుకున్నానని ఆమె తెలిపారు.అమ్మ కూలిపనులు చేస్తూ పోషించారని ఆమె కామెంట్లు చేశారు.44 సంవత్సరాల వయస్సులో బిజినెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నానని చాలా సవాళ్లను ఎదుర్కొని సక్సెస్ అయ్యానని వసునియా చెప్పుకొచ్చారు.

Telugu Primeministers-Inspirational Storys

ట్రాన్స్ ఫార్మ్ రూరల్ ఇండియా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఫెసిలిటేషన్ హబ్ వారు కూడా నాకు సహాయం చేశారని ఆమె కామెంట్లు చేశారు.తక్కువ పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టిన ఆమె ఊహించని స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారు.సంతోష్ వసునియా టాలెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంతోష్ వసునియా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ చివరకు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరిగింది.

ఆమె సక్సెస్ స్టోరీ నేటితరం యువతీయువకులకు స్పూర్తిధాయకమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సంతోష్ సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube