వైరల్: దబేలీ స్వీట్ కొత్త వెర్షన్ చూశారా? దిమ్మ తిరుగుతుంది చూడండి!

Man Transformed Dabeli Into Frozen Dabeli With Ice Cream Viral,Dabeli, Ice Cream,Frozen Dabeli With Ice Cream,Vadodara,Viral Video,Gujarat Special Sweet,Viral News

ఈ మధ్య కాలంలో చూసుకుతూనే సోషల్ మీడియా( Social Media )లో ఎక్కువగా రకరకాల రెసిపీస్ కి సంబందించిన వీడియోలు వైరల్ కావడం మనం గమనించవచ్చు.ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రెసెపీస్ ఫేమస్ అవుతూ ఉంటాయి.

 Man Transformed Dabeli Into Frozen Dabeli With Ice Cream Viral,dabeli, Ice Crea-TeluguStop.com

సో కాల్డ్ వంటకం పేరు చెప్పగానే ఠక్కున ఆ ప్రాంతం పేరు మనం చెప్పేయగలము.ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, బందరు లడ్డు, రాజమండ్రి రోజ్ మిల్క్… ఇలా చెప్పుకుంటూ పొతే మనదగ్గర స్వీట్స్ కి సంబంధించి చాలా రెసిపీలు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు.

అది పక్కన బెడితే సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది సామాన్యులు కూడా తమ మెదడుకి పని చెబుతున్నారు.అందులో ఆహార ప్రియులు రకరాలుగా రెసిపిలను తయారు చేసి నెటిజన్లతో పంచుకుంటూ వుంటారు.అయితే ఒక్కోసారి అలాంటిని రెసిపీలను చూసి నోటమాట రావడం మానేస్తుంది.ఇక ‘దబేలీ’ స్వీట్( Dabeli Sweet ) పేరు చెప్పగానే అందరికీ గుజరాత్ స్పెషల్( Guujarat Special ) అని అందరూ గుర్తు పట్టేస్తారు.

అంత ఫేమస్ అయిన ఈ స్వీట్‌కి ఇప్పుడు కొత్త వెర్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.కానీ దానిని చూసిన నెటిజన్లు మాత్రం మరోసారి ఆ స్వీట్ తినమని తెగేసి చెబుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఓ వ్యక్తి ముందుగా రొట్టెలను కత్తిరించి ఎల్లో కలర్‌లో ఉన్న లిక్విడ్ లో ముంచి తీసాడు.తరువాత ఓ సిల్వర్ రేకుల కంటైనర్ బాక్స్ తీసుకొని ఆ రొట్టెలపై సాస్ వేశాడు.ఆ తరువాత దానిపై కాజు, బాదం, పిస్తాలు పేర్చాడు.మరలా వాటిపై తీయని చట్నీ వేశాడు.ఆ వెంటనే పన్నీర్‌( Paneer )ను దానిపై యాడ్ చేశాడు.ఆ తరువాత మూడు రకాల ఐస్ ఫ్రూట్ ముక్కలను కట్ చేసి అమర్చాడు.

అలా చిత్ర విచిత్రంగా విచిత్రమైన దబేలీని రెడీ చేసాడు.అంత కస్టపడి అతను వీడియో చేస్తే నెటిజన్లు మాత్రం వాంతులు చేసుకుంటున్నారు.

ఎందుకో ఇక్కడ వీడియోని మీరే చూడండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube